తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ .. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

by Prasanna |
తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ .. ఈ జిల్లాల్లో భారీ  వర్షాలు
X

దిశ,వెబ్ డెస్క్: తెలంగాణలో గత మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతవారణశాఖ అధికారులు తెలిపారు.ఇక తెలంగాణలో అయితే మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంటున్నారు. నేడు ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్‌, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ప్రజలు అవసరం ఉంటే బయటకు రావొద్దని వాతావరణశాఖ వెల్లడించింది.

More News : ఏపీలో దంచికొడుతున్న వానలు.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Next Story

Most Viewed