- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Raja sing: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మెటా భారీ షాక్.. ఏం జరిగిందంటే?
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు టెక్ దిగ్గజ సంస్థ మెటా షాక్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు (BJP MLA Raja sing) టెక్ దిగ్గజ సంస్థ మెటా (Meta) షాక్ ఇచ్చింది. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల (Instagram, Facebook) నుంచి రాజాసింగ్ ఖాతాను తొలగించింది. ఇటీవల ఆయన ద్వేషపూరితంగా పోస్టులు చేయటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా, రాజాసింగ్‌కు ఫేస్ బుక్ పేజీల్లో 10 లక్షలకు పైగా, ఇన్‌స్టాలో లక్షా 55 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
అయితే, దీనిపై స్పందించిన రాజాసింగ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిర్యాదుతోనే ఈ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని సెలెక్టివ్ సెన్సార్‌షిప్ దాడి చేస్తోందని విమర్శించారు. తనతో పాటు తన కుటుంబసభ్యులు, స్నేహితులు, మద్దతుదారుల అకౌంట్లను బ్లాక్ చేశారని ఎక్స్‌లో ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే.. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు పని వేళలో వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్చి 2 నుంచి మార్చి 31 వరకు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే తమ ఇళ్లకు వెళ్లేలా ప్రభుత్వం అనుమతించింది. దీనిపై ఎమ్మె్ల్యే రాజాసింగ్ తీవ్రంగా మండిపడ్డారు. హిందువుల పండుగలు వచ్చినప్పుడు ఆంక్షలు విధించి.. ఇప్పుడు ముస్లింలకు పని గంటల్లో వెసులుబాటుకు ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హిందువుల ఓట్లతో గెలవలేదా? కేవలం ముస్లింల ఓట్లతోనే గెలిచిందా? అంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఇది కాస్తా వివాదస్పదంగా మారింది. ఈ వీడియో పలువురిని రెచ్చగొట్టే విధంగా ఉందని 'ఇండియా హేట్ ల్యాబ్' నివేదిక ఇవ్వటంతో మెటా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.






