కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మెస్సీ ముచ్చట.. వైరల్

by Ramesh Naini |

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ (Lionel Messi) ‘గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా’ కొనసాగుతోంది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మెస్సీ ముచ్చట.. వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ (Lionel Messi) ‘గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా’ కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో శనివారం జరిగిన ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ భారీ భద్రతా నడుమ కొనసాగింది. మ్యాచ్ అనంతరం విన్నర్‌, రన్నరప్‌ జట్లకు మెస్సీ, సీఎం రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ ట్రోఫీలు అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మెస్సీ ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రాహుల్ గాంధీ మెస్సీతో ఏమి మాట్లాడుతున్నారని నెటిజన్‌లు సందేహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి స్పానిష్ లాంగ్వేజ్ తెలుసని, మరోవైపు మెస్సీకి ఇంగ్లీష్ వచ్చని నెటిజన్‌లు ఫోటోకు కామెంట్ పెట్టారు. @HPhobiaWatch అనే యూజర్ ఎక్స్ వేదికగా ఫోటో షేర్ చేయడంతో నిమిషాల్లో ఫోటో వైరల్ అయింది.

కాగా, మ్యాచ్ అనంతరం లియోనెల్ మెస్సీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ సిటీకి వచ్చి తెలుగు ప్రజలను కలవడం సంతోషంగా ఉందని అన్నారు. తెలుగు ప్రజలు చూపించిన ప్రేమ, భారతీయుల ఆప్యాయత అభిమానం చాలా బలాన్ని ఇచ్చిందని తెలిపారు. ఇక, ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో లియోనెల్ మెస్సీ జట్టుపై 3-0 గోల్స్‌తో సింగరేణి ఆర్‌ఆర్‌ జట్టువిజయం సాధించింది. వైరల్ ట్వీట్ ఇదే..

Next Story