- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెస్సీ vs సీఎం.. ప్రపంచ దృష్టిని ఆకర్శిస్తున్న ఫుట్‌బాల్ మ్యాచ్.. సీఎం టీమ్ పేరు తెలుసా..?
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గోట్ ఇండియా టూర్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రానున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గోట్ ఇండియా టూర్ (Goat India Tour) కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రానున్న విషయం తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌లో మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ వివరాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా తెలిపింది. మెస్సీ vs సీఎం ఫుట్ బాల్ మ్యాచ్ మ్యాచ్ ప్రపంచ దృష్టిని ఆకర్శిస్తోందని తెలిపింది.
ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగనుందని పేర్కొంది. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ సింగరేణి ఆర్‌ఆర్-9, అపర్ణ జట్ల మధ్య పోటీ ఉంటుందని తెలిపింది. సింగరేణి జట్టు తరఫున సీఎం రేవంత్ రెడ్డి, అపర్ణ జట్టు తరఫున మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తారని స్పష్టం చేసింది. పిల్లల కోసం మెస్సీ ఒక ప్రత్యేక ఫుట్ బాల్ శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నారని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్‌లో పేర్కొంది. కాగా, మెస్సీ పర్యటన, ప్రముఖుల రాక నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని, ప్రముఖ క్రీడాకారుడు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ రాకపై ఇవాళ మీడియాతో మాట్లాడారు. ట్వీట్ ఇదే..






