మెస్సీ vs సీఎం.. స్టేడియంలో రాహుల్ సందడి.. సీఎం సతీమణికి ఆప్యాయ పలకరింపు

by Ramesh Naini |   (  Updated:2025-12-13 15:34:28  IST  )

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ vs సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ జరిగింది.

మెస్సీ vs సీఎం.. స్టేడియంలో రాహుల్ సందడి.. సీఎం సతీమణికి ఆప్యాయ పలకరింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ vs సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ జరిగింది. గోట్‌ కప్‌ పేరుతో ఉప్పల్‌ స్టేడియంలో ఎగ్జిబిషన్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మెస్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth reddy) ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగింది సింగరేణి ఆర్‌ఆర్‌9, అపర్ణ మెస్సీ జట్ల పేరుతో ఈ మ్యాచ్‌ జరిగింది. ఈ క్రమంలోనే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డిని రాహుల్ ఆప్యాయంగా పలకరించారు. కాగా, సింగరేణి ఆర్‌ఆర్‌ టీమ్‌ తరఫున మైదానంలో దిగిన సీఎం రేవంత్‌ రెడ్డి గోల్‌ కొట్టారు. మెస్సీ కూడా రెండో గోల్స్‌ చేశారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఇరు జట్లతో కలిసి మెస్సీ, రేవంత్‌ ఫొటోలు దిగి సందడి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ గోల్స్ చేయడం.. చూసిన అభిమానులు ఎంజాయ్ చేశారు. అలాగే మెస్సీ అభిమానులకు ఫుట్‌బాల్ కిక్‌ చేసి గిఫ్ట్‌గా ఇచ్చారు.

Next Story