కాసేపట్లో హైదరాబాద్‌కు మెస్సి రాక.. పోలీసుల వలయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు

by Kema Shiva Kumar |

'GOAT India Tour -2025’లో భాగంగా సాయంత్రం 4.30కి ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి (Lionel Messi) ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ (Hyderabad) నగరానికి రాబోతున్నారు.

కాసేపట్లో హైదరాబాద్‌కు మెస్సి రాక.. పోలీసుల వలయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: 'GOAT India Tour -2025’లో భాగంగా సాయంత్రం 4.30కి ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి (Lionel Messi) ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ (Hyderabad) నగరానికి రాబోతున్నారు. మెస్సీ రాక సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసుల భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతానికి డొమెస్టిక్ అరైవల్స్ వద్దకు ప్రయాణికులను ఒక్కొక్కరిని అనుమతిస్తున్నారు. ప్రస్తుతానికి విజిటర్స్ అవర్స్‌ను కూడా డిస్మిస్ చేశారు. మొదటగా లియోనెల్ మెస్సి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ (Taj Falaknuma Palace)కు వెళ్లి ప్రైవేట్ మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొననున్నారు.

ఈ మ్యాచ్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సింగరేణి RR-9 జట్టుతో అపర్ణ మెస్సీ ఆల్‌స్టార్స్ జట్టు పోటీ పడనుంది. మెస్సీ చివరి 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే మ్యాచ్‌లో ఆడుతారు. లియోనెల్ మెస్సి రాకను దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌పోర్టు, రూట్ మార్గాలు, స్టేడియం చుట్టుపక్కల భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత లియోనెల్ మెస్సి ముంబై, ఢిల్లీకి వెళ్లనున్నారు. మరోవైపు ఫుట్‌బాల్ అభిమానుల్లో ఈ పర్యటన మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

Next Story