- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌కు మెస్సీ రానున్నాడు.. ఇన్‌స్టా వేదికగా ఫుట్‌బాల్ దిగ్గజం ఆసక్తికర పోస్ట్
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో భారత అభిమానుల్లో ఉత్సాహం నింపాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో భారత అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. త్వరలో ప్రారంభమయ్యే ‘GOAT Tour India’లో భాగంగా ఆయన భారత్‌లో పర్యటించనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత పర్యటన షెడ్యూల్‌ను మెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు.
కోల్‌కతా, ముంబై, ఢిల్లీ నగరాలకు తోడు హైదరాబాద్‌ను కూడా రానున్నట్లు మెస్సీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. భారత్‌లో మెస్సీ నాలుగు రోజుల పాటు పర్యటించనున్నట్లు షెడ్యూల్ ద్వారా తెలుస్తోంది. అందులో భాగంగా డిసెంబర్ 13న మెస్సీ హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నారు. ‘భారతదేశం నుంచి అందుతున్న ప్రేమకు ధన్యవాదాలు. టూర్ కొన్ని వారాల్లో ప్రారంభం అవుతుంది. హైదరాబాద్‌ను కూడా నా పర్యటనలో చేర్చడం ఆనందంగా ఉంది. త్వరలో కలుద్దాం, ఇండియా!’ అని మెస్సీ స్పానిష్, ఆంగ్ల భాషల్లో పేర్కొన్నారు. మెస్సీ రావడంపై సోషల్ మీడియా వేదికల్లో అభిమానులు భారీగా స్పందిస్తున్నారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ అభిమానం ఇప్పటికే మెస్సీకి స్వాగతం చెబుతూ సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ‘హైదరాబాద్‌కు హార్థిక స్వాగతం మెస్సీ! డిసెంబర్ 13న గచ్చిబౌలి స్టేడియంలో నిన్ను చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మా నగరంలో GOAT రావడం గొప్ప గౌరవం!’ అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. కాగా, గచ్చిబౌలి స్టేడియంలో మెస్సీ సందర్శన సందర్భంగా భారీగా జనసందోహం వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు కూడా ఏర్పాట్లను వేగవంతం చేస్తుండగా, టికెట్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. పోస్ట్ ఇదే..
పర్యటన షెడ్యూల్ ఇదే..
- డిసెంబర్ 13 కోల్‌కతా- ఉదయం 10:30 గంటలకు కోల్‌కతాలో సాల్ట్ లేక్ స్టేడియం
- డిసెంబర్ 13 హైదరాబాద్- సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లో గచ్చిబౌలి స్టేడియం
- డిసెంబర్ 14 ముంబై- సాయంత్రం 5:30 గంటలకు ముంబైలో వాంఖడే స్టేడియం
- డిసెంబర్ 15 ఢిల్లీ- పర్యటన చివరి రోజు మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం






