కోఠి మహిళా వర్సిటీ మెస్ ఇంఛార్జ్ వినోద్ సస్పెండ్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-16 08:39:06  IST  )

కోఠి మ‌హిళా యూనివ‌ర్సిటీ మెస్ ఇంఛార్జ్ వినోద్ స‌స్పెండ్‌ను ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. కాలేజీలో విద్యార్థినులను వేధిస్తున్నాడు అంటూ వినోద్ పై ఆరోపణలు వచ్చాయి.

కోఠి మహిళా వర్సిటీ మెస్ ఇంఛార్జ్ వినోద్ సస్పెండ్
X

దిశ‌, వెబ్ డెస్క్: కోఠి మ‌హిళా యూనివ‌ర్సిటీ మెస్ ఇంఛార్జ్ వినోద్ స‌స్పెండ్‌ను ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. కాలేజీలో విద్యార్థినులను వేధిస్తున్నాడు అంటూ వినోద్ పై ఆరోపణలు వచ్చాయి. హాస్టల్ లో చదువుతున్న విద్యార్థినులే షీ టీమ్‌కు ఫోన్ చేసి వినోద్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. అతడి ప్రవర్తన ఇబ్బందికరంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. యాజమాన్యం కూడా అతడికే మద్దతుగా ఉందని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని తెలిపారు. తమనకు పర్సనల్ గా టార్గెట్ చేస్తారనే ఫిర్యాదు చేయలేకపోతున్నామని చెప్పారు.

తమపేర్లు బయటపెట్టవద్దని కోరారు. ప్రతి విద్యార్థిని ఇబ్బందిపెట్టేలా వినోద్ ప్రవర్తన ఉందని చెప్పారు. రంగలోకి దిగిన షీ టీమ్ ప్రిన్సిపాల్‌ను ఘటనపై ఆరా తీసింది. అయితే మొదట ప్రిన్సిపాల్ మీడియాతో మాట్లాడుతూ తమకు వినోద్ పై విద్యార్థినుల నుండి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. విద్యార్థినులను సంప్రదించినా వాళ్లు అతడి గురించి పాజిటివ్ గానే మాట్లాడుతున్నారని అన్నారు. ఇక తాజాగా వినోద్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Next Story