తొలి LGBTQ ఎంపీగా మేనక?.. ఎవరీ మేనకా గురుస్వామి.. HYDతో ఆమెకున్న లింకేంటి?

by Prasad Jukanti |   (  Updated:2026-02-28 12:26:13  IST  )

త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలతో దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం నమోదు కాబోతోంది.

తొలి LGBTQ ఎంపీగా మేనక?..   ఎవరీ మేనకా గురుస్వామి.. HYDతో ఆమెకున్న లింకేంటి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయా పార్టీలు తమ అభ్యర్థుల విషయంలో కసరత్తు చేస్తున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి నాలుగు స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. అందులో మేనకా గురుస్వామి కూడా ఒకరు. అయితే న్యాయవృత్తిలో సుదీర్ఘ అనుభవం కలిగిన మేనకా గురుస్వామి (Menaka Guruswamy) రాజ్యసభలో (Rajya Sabha Candidate) అడుగుపెడితే పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించే తొలి ఎల్‌జీబీటీక్యూ ఎంపీగా ఈమె రికార్డు సృష్టించబోతున్నారు. ఎల్‌జీబీటీక్యూ లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్ వంటి వర్గాలను తెలియజేసే పదం. మేనకా గురుస్వామి ఓ LGBTQ కావడంతో పార్లమెంట్‍కు ఆమె ప్రాతినిథ్యం ఖరారైతే దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం నమోదు కానుంది.

చారిత్రక తీర్పు వెనుక మేనకా గురుస్వామి:

మేనకా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా పని చేస్తున్నారు. స్వలింగ బంధాలు నేరంగా చెప్పే ఐపీసీ సెక్షన్ 377 ను 2018లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ చారిత్మాత్రమక తీర్పు వెనుక కీలక పాత్ర పోషించిన న్యాయవాదుల్లో మేనకా కూడా ఒకరు. మేనకా భాగస్వామి అరుంధతి కట్జు కూడా ప్రముఖ న్యాయవాది కావడం గమనార్హం.

హైదరాబాదీనే:

మేనకా గురుస్వామి హైదరాబాద్ లోనే జన్మించారు. ఆమె తండ్రి మోహన్ గురుస్వామి, తల్లి మీరా గురుస్వామి. తండ్రి గతంలో బీజేపీకి వ్యూహకర్తగా పని చేయడంతో పాటు మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా వద్ద ప్రత్యేక సలహాదారుగా కూడా పని చేశారు. మేనకా గురుస్వామి ప్రాథమిక విద్యను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివారు. 1997 లో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అయితే ఇటీవల బెంగాల్‍లో ఐ ప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాల జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో టీఎంసీ తరఫున మేనకనే వాదనలు వినిపించారు. ఈ కారణం చేతనే ఆమెకు మమతా బెనర్జీ రాజ్యసభ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Next Story