- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొందరు పోలీసులు సమాచారం ఇవ్వట్లేదు.. డీజీపీకి కంప్లైంట్ చేసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నన్స్
ఆర్టీఐ సమాచారం ఇచ్చేందుకు కొందరు పోలీసు అధికారులు నిరాకరిస్తున్నారని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యవర్గం సభ్యులు ఎం. పద్మనాభ రెడ్డి, సయ్యద్ రఫీ, టీ.వివేక్, భాస్కర్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ బీ.శివధర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీఐ సమాచారం ఇచ్చేందుకు కొందరు పోలీసు అధికారులు నిరాకరిస్తున్నారని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యవర్గం సభ్యులు ఎం. పద్మనాభ రెడ్డి, సయ్యద్ రఫీ, టీ.వివేక్, భాస్కర్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ బీ.శివధర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. సోమవారం డీజీపీ కార్యాయయంలో డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసి, పరిపాలన సంబంధిత అంశాలపై చర్చించారు. పోలీసులు పౌరుల ఫిర్యాదులను సత్వరంగా, నిష్పాక్షికంగా పరిష్కరించే విధంగా కింది స్థాయి అధికారులకు, సిబ్బందికి సూచనలు ఇవ్వాలని డీజీపీని కోరారు. కొన్ని సందర్భాలలో సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారాన్ని కొందరు క్షేత్రస్థాయి అధికారులు నిరాకరిస్తున్నారని సభ్యులు తెలిపారు. ప్రజలకు పోలీసుల ప్రవర్తన వల్ల ఎదురవుతున్న సమస్యలను ఈ మధ్యనే ఏర్పరచిన పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి పౌరులు ఫిర్యాదు చేయవచ్చని డీజీపీ తెలిపారని ఫోరం సభ్యలు వెల్లడించారు. పోలీస్ వ్యవస్థలో సుపరిపాలన దిశగా ఫిర్యాదుల పట్ల స్పందించాల్సిన పద్ధతులపై శిక్షణ చేపడతామని తెలిపారు. సంస్థ పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వెలువరించిన సోవనీర్‌ని డీజీపీకి అందజేశారు.






