బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేలా పింక్ పవర్ రన్.. పాల్గొన్న 25 వేల మంది

by Naga Rani Yarlagadda |

మేఘా ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫౌండేషన్ తో కలిసి సుధారెడ్డి ఫౌండేషన్ ఫౌండర్, చైర్ పర్సన్ మేఘా సుధారెడ్డి.. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పింక్ పవర్ రన్ 2.0 ను నిర్వహించారు.

బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేలా పింక్ పవర్ రన్.. పాల్గొన్న 25 వేల మంది
X

దిశ, వెబ్‌డెస్క్: మేఘా ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫౌండేషన్ తో కలిసి సుధారెడ్డి ఫౌండేషన్ ఫౌండర్, చైర్ పర్సన్ మేఘా సుధారెడ్డి.. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పింక్ పవర్ రన్ 2.0 ను నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. MEIL MD మేఘా కృష్ణారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, జయేష్ రంజన్, మిస్ వరల్డ్ ఓపల్ సుచాతా, నటుడు బ్రహ్మానందం, లియాండర్ పేస్ తదితరులు హాజరయ్యారు. పింక్ పవర్ రన్ 2.0లో రిజిస్టర్ చేసుకున్న పాతికవేల మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. బ్రెస్ట్ క్యాన్సర్ పై అనేకమందికి అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

గతేడాది నిర్వహించిన పింక్ పవర్ రన్ విజయవంతమైందన్న సుధారెడ్డి.. హ్యాపీ వరల్డ్ ను క్రియేట్ చేయడమే లక్ష్యంగా ఈ ఏడాది కూడా పింక్ పవర్ రన్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విపరీతమైన ఒత్తిడి వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని, దీనిపై అవగాహన కల్పిస్తూ నిర్వహిస్తున్న కార్యక్రమంలో అనేక మంది ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

Next Story