- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సమయానికి నేను అమ్మాయితో డాన్స్ చేస్తున్నాను: మెగాస్టార్ చిరంజీవి
ఆ సమయానికి నేను అమ్మాయితో డాన్స్ చేస్తున్నాను: మెగాస్టార్ చిరంజీవి

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit 2025)లో దిగ్గజ నటులు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంత గొప్ప సభలో పాల్గొనే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. విభిన్న రంగాలకు చెందిన నిష్ణాతులు ఇక్కడ ఉన్నారు. వారితో కలిసి వేదిక పంచుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఇది కేవలం చిరంజీవికి వచ్చిన ఆహ్వానం మాత్రమే కాదు.. మొత్తం సినీ ఇండస్ట్రీకి దక్కిన గౌరవం అని అన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ ఫిల్మ్ హబ్‌గా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో తాపత్రయ పడుతున్నారు. ఇతర భాషల వాళ్లు కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్‌లు చేసుకునేలా సౌకర్యవంతమైన వాతావరణం క్రియేట్ చేశారు. ప్రభుత్వం తరపున ఇండస్ట్రీకి పూర్తి మద్దతు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు. త్వరలోనే సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి మరిన్ని సమావేశాలు నిర్వహిస్తాం. రేవంత్ రెడ్డి కలలుగన్నట్లుగా హైదరాబాద్‌ను ప్రపంచానికి సినీ హబ్‌గా మార్చే ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతాం. యువత చెడు వ్యసనాల వైపు మళ్లకుండా చిత్ర పరిశ్రమ చేయగలదు. ఇదే ఆలోచనతో కొరియా ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రొత్సహించిందని చిరంజీవి గుర్తుచేశారు.
సిల్క్ డెవలప్మెంట్ చేస్తే చాలు.. అనుకున్నది సాధించగలం అన్నారు. అత్యధునిక స్టూడియోలు పెట్టేందుకు ఇప్పటికే ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందితే జీడీపీకి కూడా ఎంతో ఉపయోగం. చిత్ర పరిశ్రమకు అవసరమైన స్కిల్స్ నేర్పే అకాడమీ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించినట్లు చిరంజీవి చెప్పుకొచ్చారు.
చివరలో.. ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి చిరంజీవి ఎలాగైనా రావాలని, రేవంత్ రెడ్డి నా దగ్గరికి మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబును పంపించారు. ఆ సమయానికి నేను అన్నపూర్ణ స్టూడియోలో అమ్మాయితో డాన్స్ వేస్తున్నాను అని మెగాస్టార్ చిరంజీవి ఫన్నీగా ప్రసంగం ఫినిష్ చేశారు.






