Nandamuri Tarakaratna భౌతికకాయానికి చిరంజీవి, బాలయ్య నివాళి

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-19 10:23:29  IST  )

నందమూరి తారకరత్న భౌతికకాయానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు..

Nandamuri Tarakaratna భౌతికకాయానికి చిరంజీవి, బాలయ్య నివాళి
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి తారకరత్న భౌతికకాయానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. శంకర్‌పల్లి మండలం మోకిలలోని తారకరత్న నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తారకరత్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. అక్కడే ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డితో చిరంజీవి, బాలయ్య మటామంతీ చేశారు. కాగా అభిమానుల సందర్శనార్ధం తారకరత్న భౌతికకాయాన్ని సోమవారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


లోకేశ్ పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు

కాగా నందమూరి తారకరత్న నారా లోకేశ్ పాదయాత్రలో గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో హైదరాబాద్ మోకిలలోని స్వగృహాంలో తారకరత్న భౌతికకాయాన్ని ఉంచారు. సినీ, రాజకీయ నాయకులు తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.


అయితే సినీ అరంగేట్రంతోనే తారకరత్న ప్రపంచ రికార్డు సాధించారు. ఏ హీరో కూడా ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించలేదు. ఒక్క తారకరత్న మాత్రమే ఆ రికార్డు సాధించారు. 'ఒకటో నెంబర్ కుర్రాడు' సినిమాతో మొదలైన ఆయన సినీ కెరీర్ 'మిస్టర్ తారక్' సినిమాతో ముగిసింది. తారకరత్న మొత్తం 23 సినిమాల్లో నటించారు. 'అమరావతి' మూవీలో విలన్‌గా నటించారు. ఈ సినిమాలో తారకరత్న నటనకు నంది అవార్డు వచ్చింది.

Next Story