ఆ ప్రజారాజ్యమే.. ఈ జనసేన.. మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |
ఆ ప్రజారాజ్యమే.. ఈ జనసేన.. మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: లైలా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌(Laila Movie Prerelease Event)లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హాట్ కామెంట్స్ చేశారు. చాలా రోజుల తర్వాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఫంక్షన్‌కు వచ్చిన అభిమానులంతా జై జనసేన అంటూ నినాదాలు చేయడంతో ఆయన కూడా.. జై జనసేన(Janasena Party) అంటూ నినదించారు. మెగాస్టార్ నోట జై జనసేన అని అనడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే. నాటి ప్రజారాజ్యా పార్టీనే రూపాంతరం చెంది.. జనసేనగా మారిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగా అభిమానులంతా హర్షం వ్యక్తం చేశారు.

కాగా, 2008 ఆగష్టు 26న చిరంజీవి ప్రజారాజ్యం(Praja Rajyam Party) అనే పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన 294 స్థానాలకు గాను 18 స్థానాలు గెలుచుకుంది. మొత్తం ఓట్లలో 18% ఓట్లు ఈ పార్టీ దక్కించుకుంది. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేయగా తిరుపతి స్థానం నుండి గెలుపొందాడు. ఆగష్టు 2011లో భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో విలీనం చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు అక్కడక్కడ పవన్ కల్యాణ్ తప్ప చిరంజీవి ఎప్పుడూ మళ్లీ ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు. సడన్‌గా ఇవాళ మళ్లీ ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని మాట్లాడటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

యంగ్ హీరో విశ్వక్‌సేన్(Vishwak Sen) హీరోగా నటిస్తున్న లైలా మూవీని షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కాబోతోంది.

Advertisement
Next Story