Mega Star Fans: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో మెగా స్టార్ ఫ్యాన్స్ అత్యవసర సమావేశం

by Ramesh Naini |   (  Updated:2025-09-29 17:30:03  IST  )

సోమవారం జూబ్లీహిల్స్‌‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో మెగా స్టార్ ఫ్యాన్స్ అత్యవసర సమావేశం నిర్వహించారు.

Mega Star Fans: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో మెగా స్టార్ ఫ్యాన్స్ అత్యవసర సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ నటుడు చిరంజీవి (Mega Star Chiranjeevi), హిందూపూర్ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ ఇటీవల ఏపీ అసెంబ్లీలో మెగస్టార్‌ గురించి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మెగా అభిమాన సంఘాలు బాలకృష్ణపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ఈ మేరకు బాలకృష్ణపై రెండు తెలుగు రాష్టాల్లో నిరసనలు, ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సోమవారం జూబ్లీహిల్స్‌‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో మెగా స్టార్ ఫ్యాన్స్ అత్యవసర సమావేశం నిర్వహించారు. 5 రాష్ట్రాల నుంచి అభిమానులు తరలివచ్చారు.

ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన చిరంజీవి అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. వెంటనే నిరసనలు, ఫిర్యాదుల ఆలోచనను విరమించుకోవాలని, అది మన సంస్కారం కాదని ఆయన చెప్పారు. దీంతో మెగాస్టార్ విజ్ఞప్తి మేరకు నిరసనలు, ఫిర్యాదులను ఫ్యాన్స్ విరమించుకున్నారు. తదుపరి కార్యాచరణ తర్వాత ప్రకటిస్తామని ఫ్యాన్స్ వెల్లడించారు.

Next Story