TG: ఆరుగురు PHD అభ్యర్థులకు గోల్డ్ మెడల్స్

by Gantepaka Srikanth |

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో ఈనెల 9 వ తేదీన మెగా స్నాతకోత్సవం నిర్వహించనున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ప్రకటించారు.

TG: ఆరుగురు PHD అభ్యర్థులకు గోల్డ్ మెడల్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో ఈనెల 9 వ తేదీన మెగా స్నాతకోత్సవం నిర్వహించనున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ప్రకటించారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 56,57,58 స్నాతకోత్సవాలని ఒకేసారి రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయం కులపతి విష్ణుదేవ్ వర్మ అధ్యక్షతన నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి అంతర్జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు ప్రభు పింగళి ముఖ్య అతిథిగా హాజరయ్యి స్నాతకోత్సవ ఉపన్యాసం ఇవ్వనున్నారని చెప్పారు. ఈ స్నాతకోత్సవంలో 2,135 మంది అండర్ గ్రాడ్యూయేట్స్, 480 మంది పోస్ట్ గ్రాడ్యూయేట్స్, 129 మంది పీహెచ్‌డీలకు పట్టాలు ప్రదానం చేయనున్నామని వెల్లడించారు. అదే విధంగా 64 మంది అండర్ గ్రాడ్యూయేట్స్, 26 మంది పోస్ట్ గ్రాడ్యూయేట్స్, ఆరుగురు పీహెచ్‌డీ అభ్యర్థులకు బంగారు పతకాలు అందచేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్రభు పింగళికి గౌరవ డాక్టరేట్ :

స్నాతకోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరు కానున్న ప్రభు పింగళిని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ ఎకనమిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. టాటా- కార్నెల్ ఇనిస్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రీషన్ వ్యవస్థాపక సంచాలకులు అయిన ప్రభు పింగళి గతంలో ఇక్రిసాట్ గవర్నింగ్ బోర్డ్ చైర్మన్, యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంచాలకులు, ఫిలిప్పైన్స్‌లోని అంతర్జాతీయ వరి సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించారని వివరించారు.

Next Story