Nirmala Sitharaman: జోక్యం చేసుకోండి.. నిర్మలాసీతారామన్ ను కోరిన టీ బీజేపీలు

by Prasad Jukanti |

నిర్మలాసీతారామన్ ను కోరిన టీ బీజేపీలు

Nirmala Sitharaman: జోక్యం చేసుకోండి.. నిర్మలాసీతారామన్ ను కోరిన టీ బీజేపీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) ను తెలంగాణ బీజేపీ ఎంపీలు (Telangana BJP MPs) కలిశారు. ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేశ్ ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (Prof.Jayashankar Telangana Agricultural University) అధ్యాపకుల పీఆర్సీ బకాయిల సమస్యలపై వినతిపత్రం అందించారు. గత ఆరేళ్లుగా ఈ సమస్యతో అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్రం వాటా రాకపోతే రాష్ట్ర వాటా గల్లంతయ్యే అవకాశం ఉందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story