- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తో ప్రముఖ క్రికెటర్ సయ్యద్ కిర్మాణి సమావేశం
సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ క్రికెటర్ సయ్యద్ కిర్మాణి కలిశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ క్రికెటర్ క్రికెటర్ సయ్యద్ కిర్మాణిని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని క్రీడా విధానాలపై కిర్మాణి అభినందించారు. యువతలో ప్రతిభను వెలికితీయాల్సిన అవసరాన్ని సూచించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కిర్మాణి క్రికెట్ సేవలను ప్రశంసిస్తూ, రాష్ట్రానికి ఆయన మార్గనిర్దేశం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సమావేశంలో కిర్మాణి తన ఆత్మకథ 'స్టంప్డ్' పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు.
కాగా హైదరాబాద్ మూలాలు కలిగిన కుటుంబంలో కిర్మాణి చెన్నైలో డిసెంబర్ 29, 1949న జన్మించారు. ఈయన భారతదేశం తరపున ఆడిన గొప్ప వికెట్ కీపర్లలో ఒకరు. కిర్మాణి 1976 నుండి 1986 వరకు భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కపిల్ దేవ్ కెప్టెన్సీలో 1983 ప్రపంచ కప్ గెలిచిన టీమిడియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. స్టంప్స్ వెనుక తన ప్రతిభతో బ్యాటింగ్ తో అద్భుతమైన ప్రదర్శనతో క్రెకెట్ ప్రియులును అలరించారు. కిర్మాణి భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గాను 1982లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.






