- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్, ఎంపీటీసీల లిస్టు ఇవ్వండి: మీనాక్షి నటరాజన్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర తరువాతే పదవుల పంపకంపై ముందుడగు వేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర తరువాతే పదవుల పంపకంపై ముందుడగు వేసింది. తొలుత ఆశావాహులైన కొందరు నేతలకు నామినేటెట్పోస్టులను పార్టీ కట్టబెట్టింది. కొద్దిరోజుల కిందటే పీసీసీ కార్యవర్గాన్ని అధినాయకత్వం ప్రకటిచింది. కొత్తగా మంత్రివర్గ విస్తరణ చేపట్టి ముగ్గురికి క్యాబినెట్‌లో అవకాశం కల్పించింది. తాజాగా.. తెలంగాణ రాష్ర్ట వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు. దీంతోనే శుక్రవారం గాంధీ భవన్‌లో డీసీసీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర స్థాయి సంస్థాగత నిర్మాణ పరిశీలకులతో జూమ్ మీటింగ్నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఈసందర్భంగా మీనాక్షి నటరాజన్డీసీసీ అధ్యక్షులు, పరిశీలకుల ద్వారా పలు అభిప్రాయాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే గ్రామ పంచాయతీలతోపాటు ఆ తరువాత వరుసగా మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, కొన్ని మునిసిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. వీటిలో సర్పంచ్‌ల పదవీకాలం 2024 ఫిబ్రవరికే ముగియగా.. అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోందన్న విషయాన్ని మీనాక్షి దృష్టికి తెచ్చారు.
స్థానిక సంస్థల తర్వాతే.. మండల కాంగ్రెస్ పార్టీ..
అయితే, గ్రామాల్లో పార్టీ పదవులపైనే ఆశలు పెట్టుకున్న నేతలు త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నారు. ఇలాంటి తరుణంలో మండల కాంగ్రెస్పార్టీ నాయకత్వ నియమకాలు చేపడితే ఎలా ఉండనుందని మీనాక్షి డీసీసీ అధ్యక్షులు, పరిశీలకులను అడిగినట్టు తెలిసింది. ఒకవేళ ఇప్పటికిప్పుడు మండల కాంగ్రెస్పార్టీ నాయకత్వాన్ని ప్రకటిస్తే.. పదవులు దక్కని వారితో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదమే ఎక్కువ ఉన్నదని అధినాయకత్వం ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఎందుకంటే.. పదవులు దక్కని వారు వేరేతర పార్టీలో వెళ్లిపోతే.. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశముందని మీనాక్షి నటరాజన్భావించినట్టు సమాచారం. దీంతోనే ఆమె మండల కాంగ్రెస్పార్టీ నాయకత్వం ఇప్పుడు కాకుండా... స్థానిక సంస్థల తర్వాతే చేపట్టడమే బెటర్అని డీసీసీ అధ్యక్షులు, పరిశీలకులతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీనికి అందరూ ఏకీభవించడంతో మండల కాంగ్రెస్పార్టీ నియమకాలు జోలికి వెళ్లవదవ్దని డిసైడ్అయిందని ఆ పార్టీ వర్గీయుల సమాచారం.
2017 నుంచి సర్పంచ్, ఎంపీటీసీల లిస్టు ఇవ్వండి..
ఇదిలాఉంటే.. 2017 సంవత్సరం నుంచి కాంగ్రెస్పార్టీల కొనసాగుతూ సర్పంచ్, ఎంపీటీసీలు గెలిచిన ప్రజాప్రతినిధులు, పోటీ చేసిన అభ్యర్థులు జాబితా ఇవ్వాలని డీసీసీ అధ్యక్షులు, పరిశీలకులను మీనాక్షి నటరాజన్కోరారు. వాస్తవానికి డీసీసీ అధ్యక్షులు, పరిశీలకులను ఏర్పాటు చేసిన అధిష్టానం మండల కాంగ్రెస్పార్టీకి సంబంధించిన ఇదివరకే ఒక్కొ మండలం నుంచి నలుగురి చొప్పున పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేశారు. ప్రస్తుతానికి ఇంచార్జి మీనాక్షి నటరాజన్తీసుకున్న నిర్ణయంతో ఆయా జాబితా కాకుండా సర్పంచ్, ఎంపీటీసీలు గెలిచిన ప్రజాప్రతినిధులు, పోటీ చేసిన అభ్యర్థుల పేర్లు త్వరగా పేర్లు అందజేయాలని సూచించినట్లు తెలిసింది.
పదవుల్లో సామాజిక న్యాయం పాటించాం..
కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పదవుల పంపిణి సామాజిక న్యాయ పరంగా జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ మార్గదర్శనంలో "సమాజంలో ఎవరి వాటా వారికే" అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి పదవిలోనూ సామాజిక న్యాయం పాటించామని, ఇకపై కూడా పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపునిస్తూ ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. పార్టీ కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, పదవులు లభిస్తాయని స్పష్టంగా పేర్కొన్నారు.
గ్రామ స్థాయిలో పకడ్బందీగా..
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పకడ్బందీగా చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతలకు సూచించారు. మండల, జిల్లా స్థాయిల కమిటీల నిర్మాణం సకాలంలో పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర పరిశీలకులు, కో-ఆర్డినేటర్లు నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. "జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్" కార్యక్రమాలను తెలంగాణలో విస్తృతంగా, విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకన్నా ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత మనదేనని పేర్కొన్నారు.






