- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో తెలంగాణలో మీనాక్షీ నటరాజన్ పాదయాత్ర
by Muthe.Rajitha |
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల(AICC) ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర(Padayatra) చేపట్టనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల(AICC) ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర(Padayatra) చేపట్టనున్నారు. ఈ పాదయాత్ర పరిగి నియోజకవర్గం నుంచి ప్రారంభమై, ప్రతి నియోజకవర్గంలో 8-10 కిలోమీటర్ల దూరం కవర్ చేస్తూ, వారం రోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, ప్రజలతో మమేకం కావడం, ర్టీలో కొత్త, పాత నాయకుల మధ్య సమన్వయాన్ని కల్పించడం ప్రభుత్వ విధానాలు, పథకాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగనుందని తెలుస్తోంది. ఈ పాదయాత్ర షెడ్యూల్‌ను ఈరోజు సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో పాదయాత్రలో భాగంగా వివిధ నియోజకవర్గాల్లో సందర్శించే గ్రామాలు, పట్టణాలు, సమావేశాల వివరాలు ఉంటాయి.
Next Story






