Meenakshi Natarajan: హైదరాబాద్‌కు చేరుకున్న మీనాక్షి నటరాజన్.. స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

by Kema Shiva Kumar |

తెలంగాణ నూతన ఏఐసీసీ ఇంచార్జీగా ఎన్నికైన మీనాక్షి నటరాజన్ తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు.

Meenakshi Natarajan: హైదరాబాద్‌కు చేరుకున్న మీనాక్షి నటరాజన్.. స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నూతన ఏఐసీసీ ఇంచార్జీగా ఎన్నికైన మీనాక్షి నటరాజన్ (Meenakshi Nararajan) తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. ఈ మేరకు కాచిగూడ రైల్వే స్టేషన్‌ (Kachiguda Railway Station)లో ఆమెకు టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన వెంట ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ (Harkara Venugopal), ఫహీం, రచమల్ల సిద్దేశ్వర్ ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాగా, ఇవాళ గాంధీ భవన్‌ (Gandhi Bhavan)లో తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ భేటికి టీపీసీసీ చీఫ్‌ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించనున్నారు.

అయితే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీగా నూతనంగా నియమితులైన మీనాక్షి నటరాజన్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka), ఏఐసీసీ కార్యదర్శులు, ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పీఏసీ, పీఈసీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు, నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అధికార ప్రతినిధులు భేటీలో పాల్గొంటారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి.

Next Story