- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ.కాంగ్రెస్‌లో బుజ్జగింపుల పర్షం షురూ.. ఆ ముగ్గురి ఇంటికి మీనాక్షి నటరాజన్!
కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress)కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress)కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. కేబినెట్‌లో మంత్రి పదవి దక్కి కొందరు ఫుల్ ఖుషీలో ఉండగా.. ఆశించి భంగపడ్డ నేతలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్‌కు చెందిన సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు తమకు తప్పకుండా అవకాశం ఉంటుందని ఆశించారు. ఇదే విషయాన్ని తరచూ అనుచరులు, కార్యకర్తలతో చెప్పుకుంటూ వచ్చారు. చివరకు అనూహ్యంగా వారికి అధిష్టానం మొండిచేయి చూపడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించడానికి సిద్ధమైంది. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్‌లు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. సుదర్శన్ రెడ్డితో చర్చల అనంతరం ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో మాట్లాడేందుకు వెళ్తారని సమాచారం.
కాగా, తాజా మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. బీసీల నుంచి వి.శ్రీహరి ముదిరాజ్, ఎస్సీల నుంచి వివేక్ (మాల), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (మాదిగ)లకు చోటు లభించింది. శాసనసభ ఉప సభాపతిగా రామచంద్రునాయక్‌ను ఎంపిక చేశారు. వీరంతా కాసేపట్లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.






