- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాజిక న్యాయాన్ని విశ్వసించిన మహా నేత వైఎస్ఆర్
సామాజిక న్యాయాన్ని విశ్వసించిన మహా నేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి

సామాజిక న్యాయాన్ని
విశ్వసించిన మహా నేత వైఎస్ఆర్
== ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్
దిశ, తెలంగాణ బ్యూరో: సామాజిక న్యాయాన్ని విశ్వసించిన మహా నేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. సోమవారం ఈ మేరకు వై.ఎస్. రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన సామాజిక్ న్యాయం , సమత సంవాద్ లను విశ్వసించారన్నారు. వైఎస్ఆర్పదవీ కాలంలో హక్కుల ఆధారిత విధానాలు, ఆరోగ్యశ్రీ , ఆరోగ్య బీమా పథకం వంటి చట్టాలను అమలు చేశారని, ఇది బీపీఎల్ కుటుంబాలను ఆరోగ్య సమస్యల వల్ల కలిగే ఖర్చుల నుండి రక్షించిందన్నారు.
ఆయన హయాంలో ప్రారంభమైన 108 అంబులెన్స్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉండేలా చేసిందని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. పెన్షన్లు మహిళలు గౌరవంగా జీవించడానికి వీలు కల్పించాయని, మొదటిసారిగా మహిళా రైతులకు వ్యవసాయ రుణాలు అందించారని పేర్కొన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ (MGNREGA ) కోసం సామాజిక తనిఖీ పారదర్శకతను నిర్ధారిస్తుందని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇతర విధానాలు రైతులకు ప్రయోజనం చేకూర్చాయని గుర్తు చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాలలో రాజ్యాంగ చట్టంలో శాంతి చర్చలకు మార్గం సుగమం చేసిందని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు.






