మంత్రి కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్

by Ajay Maddhiboyina |

హైద‌రాబాద్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటివద్ద బుధవారం రాత్రి హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు సొంతపార్టీలో దుమారం రేపుతున్నాయి. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

మంత్రి కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్
X

దిశ, వెబ్ డెస్క్: హైద‌రాబాద్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటివద్ద బుధవారం రాత్రి హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు సొంతపార్టీలో దుమారం రేపుతున్నాయి. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మంత్రి సురేఖకు ఫోన్ చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని చెప్పినట్టు సమాచారం అందుతోంది. దీంతో మరికొద్దిసేపట్లో సురేఖ మీనాక్షి నటరాజన్‌‌తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు మధ్యాహ్నం కేబినెట్ సమావేశం ఉండగా మీటింగ్‌కు వస్తానని తన సహచర మంత్రులకు కొండా సురేఖ చెప్పినట్టు తెలుస్తోంది. కాబట్టి మీనాక్షి నటరాజన్‌తో భేటీ తరవాతనే కొండా సురేఖ కేబినెట్ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అవినీతి ఆరోపణల నేపథ్యంలో కొండా సురేఖ ఓఎస్డీని ప్రభుత్వం తొలగించింది. బుధవారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు కొండా సురేఖ ఇంటివద్దకు వెళ్లగా కొండా సుస్మిత వారిని అడ్డుకున్నారు. మంత్రి అతడిని కారులో బయటకు తీసుకుని వెళ్లిపోయింది. అంతేకాకుండా సుస్మిత ప్రభుత్వంలోని పలువురు నేతలపై ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్‌తో భేటీ తరవాత ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Next Story