- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై వాట్సాప్‌లో మీ సేవా సర్వీసులు : మంత్రి శ్రీధర్ బాబు
by Muthe.Rajitha |
ఇకపై ప్రభుత్వ సేవలు సులభతరంగా పొందటానికి సర్కార్ కీలక చర్యలు తీసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఇకపై ప్రభుత్వ సేవలు సులభతరంగా పొందటానికి సర్కార్ కీలక చర్యలు తీసుకుంది. అన్ని రకాల మీసేవ సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేసింది. ఈమేరకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మీసేవా వాట్సాప్ సర్వీసులను ప్రారంభించారు. ప్రజలు మీసేవలో పొందే మొత్తం 580 సేవలను వాట్సాప్‌లోనే పొందే అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాదు విద్యుత్ బిల్లు, ఆస్తి పన్ను చెల్లింపులు చేయడం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, జనన/మరణ ధ్రువీకరణ పత్రాలు వంటివి ఇంటి నుంచే పొందే అవకాశం ఉంది. ఈ సేవలన్నీ క్రమంగా వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే అన్ని సేవలను సులభంగా పొందవచ్చు.
Next Story






