TG Assembly: మేడిగడ్డ తరహా కుట్రేనా? అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి బాంబ్ కామెంట్స్

by Ramesh Naini |   (  Updated:2025-12-29 06:12:46  IST  )

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

TG Assembly: మేడిగడ్డ తరహా కుట్రేనా? అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి బాంబ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను బాంబులతో పేల్చినట్లు తన నియోజకవర్గంలో చెక్ డ్యాములను కూడా బాంబులతో పేల్చివేశారని, ఈ అంశంపై విచారణ జరపాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా తణుగుల చెక్ డ్యామ్ పేలుడును ఉదాహరణగా చూపుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగగా.. ఇక్కడ కూర్చొని చెప్పడం కాదు, ఘటనా స్థలానికి వెళ్దాం పదండి అంటూ కౌశిక్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఈ మేరకు చెక్ డ్యాముల అంశాన్ని నోట్ చేసుకున్నట్లు మంత్రి సీతక్క సభలో స్పష్టం చేశారు. వీడియో ఇదే..

Next Story