- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడిగడ్డను ఇకనైనా వినియోగంలోకి తేవాలి: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి
తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్ చేతిలోనే ఉందని, కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. రే

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి కేవలం కేసీఆర్ (KCR) చేతుల్లోనే ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్ రెడ్డి (T Jeevan Reddy) అన్నారు. ఇవాళ ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో బలహీన వర్గాలు విద్యకు దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని కామెంట్ చేశారు. ఇప్పటికైనా రాజకీయ కక్షలు పక్కన పెట్టి, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మేడిగడ్డను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి కళ్లు మూసుకున్నా ఆయన కలలో కేసీఆర్ వస్తున్నారని.. ఆ భయంతోనే అభివృద్ధిని విస్మరిస్తున్నారని జీవన్ రెడ్డి సెటైర్లు వేశారు. అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో కేటీఆర్ చేసిన పోరాటాన్ని రాష్ట్ర ప్రజలెవరూ విస్మరించలేదని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలోనే మళ్లీ తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తుందని ధీమా జీవన్ రెడ్డి అన్నారు.






