స్టైఫండ్ కోసం మేడికోల నిరసన.. యజమాన్యం వైఖరిపై ఆగ్రహం

by Gantepaka Srikanth |

చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కి చెందిన మెడికోలు తమకు రావాల్సిన స్టైఫండ్ బకాయిల కోసం రోడ్డెక్కారు.

స్టైఫండ్ కోసం మేడికోల నిరసన.. యజమాన్యం వైఖరిపై ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కి చెందిన మెడికోలు తమకు రావాల్సిన స్టైఫండ్ బకాయిల కోసం రోడ్డెక్కారు. జీవో నెంబర్ 59 ప్రకారం ఎంబీబీఎస్ పూర్తయి ఇంటర్న్ షిప్ చేస్తున్న మెడికోలతో పాటు.. పీజీ చేస్తున్న డాక్టర్లు సైతం ఈ నిరసనలో పాల్గొన్నారు. ఇప్పటికే దీనిపై దేశవ్యాప్తంగా స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయని.. గతంలో సుప్రీంకోర్టు సూచించిన విధంగా తమకు రావలసిన డబ్బులను సైతం తమ కాలేజీ యజమాన్యాలు పక్కదారి పట్టిస్తున్నాయని వారు ఆరోపించారు. ఇప్పటికైనా యజమాన్యం కళ్ళు తెరిచి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

గత కొంతకాలంగా కాలేజీ యాజమాన్యం మాకు ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వడం లేదు. మొదట్లో మా అకౌంట్లో డబ్బు జమ చేసి ఇచ్చినట్టుగా చూపించి తిరిగి కేవలం రూ.10000 మాత్రమే మాకు కేటాయిస్తోంది. మిగిలిన సొమ్మును యజమాన్యమే వెనక్కి తీసుకుంటుంది.. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని బెదిరింపులకు గురి చేస్తోంది మరోవైపు పేరెంట్స్‌కి కాల్ చేస్తూ అనవసర ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికైనా మా సమస్యని పరిష్కరించకపోతే ఈ నిరసన మరింత పెంచుతామని మెడికోలు ప్రకటించారు.

Next Story