- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : 15 మంది ఆర్ఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కేసులు నమోదు
తెలంగాణ(Telangana)లో నకిలీ ఆర్ఎంపీ(RMP), పీఎంపీ(PMP)లపై కేసులు నమోదు అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో నకిలీ ఆర్ఎంపీ(RMP), పీఎంపీ(PMP)లపై కేసులు నమోదు అవుతున్నాయి. గత కొన్ని నెలలుగా నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నామని, టీజీఎంసీ(Telangana Medical Council) వైస్ చైర్మన్ డా. జి. శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. కాగా, మెడికల్ కౌన్సిల్ అధికారులు గత నెలలో జీడిమెట్ల, మియాపూర్, గజ్వెల్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి ఆయా పోలీస్ స్టేషన్ ఫరిధిలో ఎన్ఎంసి చట్టం 34,54 టిఎస్ఎంపిఆర్(TSMPR) చట్టం 22 ప్రకారం కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఆర్ఎంపీలు, పీఎంపీలు పరిధి దాటి వైద్యం చేస్తున్నారని, రాష్ట్రంలో పూర్తిగా ఎన్ఎంసీ(NMC) చట్టాన్ని అమలు చేస్తామని తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 400 మందికి పైగా కేసులు వేసినప్పటికి ఆర్ఎంపీలు, పీఎంపీలు తమ తీరు మార్చుకోకుండా పరిధి దాటి వైద్యం చేస్తూ అమాయక ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.
ఆర్ఎంపీలు ఎలాంటి విద్యార్హతలు లేకుండా ఎంబీబీఎస్ డాక్టర్ల మాదిరిగా అశాస్త్రీయంగా వైద్యం చేస్తున్నారన్నారు. వారి వద్దకు వచ్చే రోగులకు ఇష్టారీతిన యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ప్రజారోగ్యానికి పెనుముప్పు వాటిల్లుతుందన్నారు. అనంతరం పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ డా. నరేష్ కుమార్ మాట్లాడుతూ... ప్రజారోగ్యాన్ని పరిరక్షించే బాధ్యత మన అందరి పైన ఉందని, ఎన్ఎంసి చట్టం ప్రకారం ఎంబీబీఎస్ విద్య అభ్యసించకుండా అల్లోపతి వైద్యం చేయరాదని, ఆర్ఎంపీ, పీఎంపీ అని చెప్పుకుంటూ నకీలీ వైద్యులు మెడికల్ ప్రాక్టీషనర్ అని వ్రాసుకునే అర్హత లేదన్నారు. ఎన్ఎంసి చట్టం, గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం ఎటువంటి విద్యార్హత లేని నకిలీలకు శిక్షణ ఇవ్వడం, వారికి గుర్తింపు ఇవ్వడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఎవరైనా అలా చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.






