- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్య, ఆరోగ్య శాఖ బదిలీల గైడ్‌లైన్స్ విడుదల.. ఈ నెల 30న అభ్యంతరాల స్వీకరణ
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలో బదిలీల మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించి ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. బదిలీల ప్రక్రియ అంతా పారదర్శకంగా, కేవలం ఆన్‌లైన్ లేదా వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే నిర్వహించనున్నారు. వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు, ఏ కేడర్‌లోనైనా గరిష్టంగా 40 శాతానికి మించకుండా మాత్రమే బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే స్టేషన్‌లో 4 ఏళ్లు పూర్తి చేసుకున్న వైద్యులు ఆటోమేటిక్‌గా బదిలీకి అర్హులు కారని, 40 శాతం గరిష్ట పరిమితికి లోబడి మాత్రమే వీరి బదిలీలు ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే స్పెషలిస్ట్ డాక్టర్లను వారి సంబంధిత స్పెషాలిటీ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లోనే నియమించాలని, సూపర్ స్పెషాలిటీ పోస్టుల బదిలీలను కూడా ఆయా విభాగాల అవసరాల ప్రాతిపదికన, విధులు నిర్వహించే యూనిట్లు ఉన్న చోటనే భర్తీ చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఖాళీల వివరాలు, దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగుల జాబితా, సీనియారిటీ లిస్ట్‌లను ఆన్‌లైన్‌లో ఉంచే ముందు వాటిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక పరిశీలన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో టీజీఎంఎస్ఐడీసీ (TGMSIDC) ఎండీ, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి సభ్యులుగా వ్యవహరిస్తారు. బదిలీల ప్రక్రియలో తలెత్తే సమస్యలు, అభ్యంతరాల పరిష్కారం కోసం ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ పరిధిలో ఒక ప్రత్యేక గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సెల్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.






