- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టులకు ధ్యానమే శ్రీరామరక్ష.. ఒత్తిడిని జయించేలా దిశానిర్దేశం
ప్రస్తుత వేగవంతమైన 24 గంటల న్యూస్ సైకిల్, డిజిటల్ ఒత్తిడి నేపథ్యంలో మీడియా ప్రతినిధులు అంతరంగ శాంతిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

- గచ్చిబౌలిలో 'మీడియా, మెడిటేషన్-సామాజిక శాంతి' సదస్సు
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుత వేగవంతమైన 24 గంటల న్యూస్ సైకిల్, డిజిటల్ ఒత్తిడి నేపథ్యంలో మీడియా ప్రతినిధులు అంతరంగ శాంతిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని కాంతి సరోవర్‌లో బ్రహ్మాకుమారీస్ మీడియా వింగ్ ఆధ్వర్యంలో 'మీడియా, మెడిటేషన్-సామాజిక శాంతి' అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 80 మంది ఎడిటర్లు, రిపోర్టర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు హాజరయ్యారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాది అత్యంత కీలకమైన పాత్ర అని, సమాజానికి దిశానిర్దేశం చేయడంలో మీడియా విఫలం కాకూడదని పేర్కొన్నారు. అసత్య వార్తలు, విభజన ధోరణులు సమాజాన్ని బలహీనపరుస్తాయన్నారు. ధ్యానం ద్వారా జర్నలిస్టులు తమలో కాంతిని నింపుకుంటేనే, సమాజంలో శాంతిని నెలకొల్పగలరని ఆయన తెలిపారు. హైదరాబాద్ జోన్ డైరెక్టర్ బీకే కుల్దీప్ దీదీ మాట్లాడుతూ.. మీడియా ద్వారా సానుకూల మార్పు రావాలంటే మాటల్లో పవిత్రత, అంతరంగంలో శాంతి ఉండాలని సూచించారు. పరమాత్మతో అనుసంధానం ద్వారా ఆత్మబలాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ శంకర్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో నియంత్రణ లేకపోవడం వల్ల ఫేక్ న్యూస్ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ మీడియా కోఆర్డినేటర్ బీకే సుశాంత్ భాయిజీ, సీనియర్ రాజయోగ టీచర్ సిస్టర్ అంజలి, సిస్టర్ ఉమా రాణి తదితరులు పాల్గొన్నారు.






