కారులో వచ్చి యువతిని కిడ్నాప్ చేసిన యువకులు.. జుట్టు పట్టుకుని దారుణం!?

by Jakkula.Mamatha |

గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది.

కారులో వచ్చి యువతిని కిడ్నాప్ చేసిన యువకులు.. జుట్టు పట్టుకుని దారుణం!?
X

దిశ,వట్ పల్లి: గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ యువతిని కిడ్నాప్ చేసిన ఘటన మండల పరిధిలోని దరఖాస్తుపల్లిలో తీవ్ర కలకలం రేపింది. ఎస్ఐ లవ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ధరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన యువతి తన తమ్ముడితో కలిసి బైక్‌ పై వారి వ్యవసాయ భూమి దగ్గర గల దర్గా దగ్గరకు పూజ చేయడానికి వెళ్ళింది. పూజ అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన ఇటిక్యాపల్లి శ్రీకాంత్ , ఇటిక్యాపల్లి జగధీశ్వర్, మామిడిపల్లి లక్ష్మణ్ ఒక పథకం ప్రకారం బైక్ మరియు కారులో ముగ్గురు కలిసి.. వారి బైక్ ను అడ్డగించి కారులో (TS 15 UF 1556) యువతిని తీసుకుని వెళ్లారు.

బాధితురాలు అరవడంతో ఊపిరి ఆడకుండా నోటిలో గుడ్డలు పెట్టారు. బాధితురాలు తమ్ముడు వెంటనే ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాదితురాలు యొక్క జుట్టు పట్టుకుని ఇష్టమొచ్చినట్లుగా గుంజుతూ కొద్ది దూరం వెళ్ళిన తరువాత తల వెంట్రుకలు పట్టుకుని మెడ చుట్టూ చుట్టి నీవు నాకు కాదని గోరకంటి వెంకటేష్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఇప్పుడే చెప్పు అంటూ మెడ చుట్టూ జుట్టు పట్టుకుని చంపే ప్రయత్నం చేసినట్లు బాధితులు తెలిపారు. అంతటితో ఆగకుండా చెప్పులతో కొట్టినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు వట్ పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా జిల్లా ఎస్పీ సూచనల మేరకు రెండు-మూడు టీంలుగా ఏర్పడి నేరస్తుల నుంచి బాధితురాలిని కాపాడారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నేరస్తులను రిమాండ్‌కు పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై 2 శ్రీహరి సిబ్బంది పాల్గొన్నారు.

Next Story