- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ కార్మికుడికి న్యాయం జరిగేనా..?
ప్రమాదకరంగా ఉండే ప్రధాన రహదారులను శుభ్రం చేసే పనులను యంత్రాల ద్వారా కాకుండా అధికారులు కార్మికులతో చేయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

దిశ, కూకట్పల్లి: సీఎంసీ అధికారుల నిర్లక్ష్యం కార్మికుల పాలిట శాపంగా మారుతుంది. ప్రమాదకరంగా ఉండే ప్రధాన రహదారులను శుభ్రం చేసే పనులను యంత్రాల ద్వారా కాకుండా అధికారులు కార్మికులతో చేయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇటీవల మూసాపేట్ సర్కిల్ పరిధి బాలానగర్‌లో రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికుడు జోసెఫ్‌ను ఓ ద్వాచక్ర వాహనం ఢీకొట్టడంతో ఆయనకాలు విరిగింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న తోటి కార్మికులు హుటాహుటిన అతడిని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించగా ఎక్స్‌రే తీసిన వైద్యులు జోసెఫ్కుడి కాలు రెండు ఎముక విరిగినట్టు తెలిపారు. శస్త్ర చికిత్స చేయాల్సి వస్తుంది కాని ఆసుపత్రిలో ఇప్పుడు ఖాళీ లేదు ఇప్పుడు కుదరదు అంటు సమాధానం ఇచ్చి ఇంటికి పంపించారు. కాలుకు సిమెంట్ పట్టి వేసి ఇంటికి వెళ్లండి, సమాచారం అందించినప్పుడు ఆసుపత్రికి రండి శస్త్ర చికిత్స చేస్తామని వైద్యులు చెప్పారు.
ప్రైవేటులో రూ.2 లక్షలకు పైగా ఖర్చు:
కార్మికులకు వైద్యం అందించాల్సిన ఈఎస్ఐలో సరియైన స్పందన, వైద్యం అందక పోవడంతో జోసెఫ్ కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి సంప్రదించగా రూ.2 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేని పేదరికం, విరిగిన కాలుతో ఇంట్లో మంచానికే పరిమితం అయిన జోసెఫ్‌ను చూస్తున్న కుటుంబ సభ్యులు కుమిలి పోతున్నారు.
పత్తాలేని అధికారులు:
మూసాపేట్సర్కిల్ పరిధి బాలానగర్‌లో రోడ్డు ప్రమాద బారినపడి గాయాల పాలైన కార్మికుడిని సర్కిల్అధికారులు పరామర్శించడం, వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరగలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. అధికారుల వత్తిడి వల్లే ప్రధాన రహదారులు, డివైడర్‌ల పొడవున చెత్తను తొలగించే పనులు చేపడుతున్న కార్మికులు ప్రమాద బారిన పడితే కనీసం అధికారులు పరామర్శించక పోవడం మానవత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఉందని కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి






