- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డి ఎక్కడికెళ్లారు: ఎమ్మెల్యే మాధవరం
దిశ, కూకట్పల్లి: మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి కనిపించకుండా పోయారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. మూసాపేట్ డివిజన్ పరిధిలోని రాయల్ గార్డెన్స్‌లో మాజీ కార్పొరేటర్ తూం శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఇంత వరకు కూకట్‌పల్లిలో కనిపించిన దాఖలాలు లేవని అన్నారు. మూసాపేట్ కార్పొరేటర్‌గా గెలిపిస్తే నిధులు తీసుకు వచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పిన బీజేపీ కార్పొరేటర్ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పాలని అన్నారు. ప్రజల కోసం పాటు పడుతున్న ప్రభుత్వం కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు.
తెలంగాణలో నివాసం ఉంటున్న ఒరిస్సా, శ్రీకాకూళం ప్రాంతాలకు ప్రజలు తెలంగాణ బిడ్డలేనని అన్నారు. వేరే ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకుంటామని, అందరికి సమానంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు బాబు రావు, కాండూరి నరేంద్ర చార్య, నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీష్ అరోరా, సీహెచ్ సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, ప్రభాకర్ గౌడ్, కర్క పెంటయ్య, టీ అశోక్, జిల్లా గోపాల్, బి నర్సింగ్ రావు, నాగుల సత్యం, నపారి చంద్రశేఖర్, కర్క రవీందర్ తదితరులు పాల్గొన్నారు.