- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతుకమ్మ ఉత్సవం మాత్రమే కాదు..ప్రజా ఉద్యమం
బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవం మాత్రమే కాదని.. అది మహా ఉద్యమం అని ప్రజా గాయని, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య

దిశ, నాచారం: బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవం మాత్రమే కాదని.. అది మహా ఉద్యమం అని ప్రజా గాయని, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పేర్కొన్నారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం లోని మల్లాపూర్ గోకుల్ నగర్ కాలనీలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క సమక్షంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విమలక్క మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్తేజపరిచారు. ‘ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ’ అనే నినాదంతో ఈ ఏడాది బహుజన బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకల్లో మహిళలు వివిధ రూపాల్లో బతుకమ్మను తయారు చేసి సాముహికంగా పూజలు చేయడమే కాకుండా ఆటపాటలతో సందడి చేశారు.
ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని.. ఇది ఉత్సమే కాదు అడవులను సంరక్షించే మహా ఉద్యమం అని పిలుపునిచ్చారు. ప్రకృతి రక్షణకై ప్రతి ఒక్కరూ పాటుపడాలని, అడవుల సంరక్షణ నేటి యువత బాధ్యత అని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా స్త్రీలు బతుకమ్మ ఆవిర్భావాన్ని, అవసరాన్ని అర్థం చేసుకోవాలని..అవమానం ఎదురైతే..తిరుగుబాటు బతుకమ్మతో మొదలవ్వాలని విమలక్క పిలుపునిచ్చారు. ప్రపంచం అంతా గుర్తించి జరుపుకుంటున్న బతుకమ్మకు నేటికి గ్రామాల్లో కులపిచ్చి, నమ్మకాలతో దూరంగా ఉంటున్న ప్రజల్లో అవగాహన, ఆసక్తి కల్పించాలని సూచించారు. తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ అవసరమైనప్పుడు నేను దేనినైనా ఎదిరించి నిలబడుతా అనే ధైర్యానికి గుర్తుగా చేతిలో బంగారు బతుకమ్మతో నిలబడాలి అని ధైర్యాన్ని నూరిపోశారు . గోకుల్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాపోలు రాములు, మల్లయ్య, కే రాజు, వి ఎస్ ఎన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, లావణ్య, లక్ష్మి, విజయ, పుష్పాలత, ఇందిరా తదితరులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






