వజ్రోత్సవ వేడుకల్లో విషాదం.. గజనీ దండయాత్ర గురించి చెబుతూ..

by Vinod kumar |   (  Updated:2023-04-13 17:12:43  IST  )

దిశ, కాప్రా : భాతర స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో విషాదం - Tragedy at Vajrotava celebrations.. Uppala Suresh died while giving a speech about independent India

వజ్రోత్సవ వేడుకల్లో విషాదం.. గజనీ దండయాత్ర గురించి చెబుతూ..
X

దిశ, కాప్రా : భాతర స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కాప్రా సర్కిల్ పరిధిలో ని వంపుగూడ లక్ష్మి విల్లాస్ లో సోమవారం స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని కాలనీలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల సురేష్(56) అనే వ్యాపారి ఇక్కడి వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం స్వతంత్ర వేడుకలపై ప్రసంగిస్తూనే హఠాత్తుగా గుండె పోటుతో మృతి చెందారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా కాప్రాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గజనీ దండయాత్ర గురించి చెబుతునే కిందపడి మృతి చెందడం కాలనీవాసులను విస్మయానికి గురిచేసింది.

మృతుడు ఉప్పల సురేష్ బాగ్ అంబర్ పేట డి.డి కాలనీలో ఫార్మాస్యూటికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పలువురు ప్రముఖులు మృతుడు ఉప్పల సురేష్‌కు నివాళ్పరించి, ఆయన సతీమణి కరుణను, కూతురు మైత్రిని, తనయుడు ధర్మపాల్‌ను పరామర్శించారు. తన కళ్ళ ముందే కన్న కొడుకు హఠన్మరణం చెందడంతో మృతుడి తండ్రి యాదగిరి శోకసంద్రంలో మునిగారు. ఉప్పల సురేష్ మృతి పట్ల రచయిత, సీనియర్ కళాకారుడు కళారత్న మల్లం రమేష్ పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Next Story