పేపర్ ప్లేట్లు చోరీ చేస్తూ దొరికిపోయిన దొంగ !

by velandi.Saikiran |

పేపర్ ప్లేట్లు చోరీ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పేపర్ ప్లేట్లు చోరీ చేస్తూ దొరికిపోయిన దొంగ !
X

దిశ, మేడిపల్లి : పేపర్ ప్లేట్లు చోరీ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని షాప్ యజమాని పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం బ్యాంక్ కాలనీకి చెందిన యాద శ్రీకర్ గత రెండేళ్లుగా పీర్జాదిగూడలో పేపర్ ప్లేట్లు, ఇతర వస్తువుల తయారీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం దుకాణం తెరిచి ఇంట్లోకి వెళ్లిన శ్రీకర్, కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చేసరికి ఓ వ్యక్తి షాప్‌ లోని పేపర్ ప్లేట్లను అనుమతి లేకుండా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించాడు. వెంటనే అతడిని ( శివకృష్ణ) పట్టుకుని, పోలీసుల‌కు అప్ప‌గించాడు. ఇక‌ బాధితుడి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story