- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Sitakka : మా గ్రామాలను యాదాద్రి జిల్లాలో కలపొద్దు..
by Batti.Sumithra |
ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్, అంకుషాపూర్, మాదారం గ్రామాలను యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపొద్దని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క (అనసూయ)ను ఘట్కేసర్ మండల బీజేపీ నాయకులు, గ్రామస్తులు కోరారు.

X
దిశ, ఘట్కేసర్ : ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్, అంకుషాపూర్, మాదారం గ్రామాలను యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపొద్దని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క (అనసూయ)ను ఘట్కేసర్ మండల బీజేపీ నాయకులు, గ్రామస్తులు కోరారు. శనివారం బీజేపీ నాయకుడు ఏనుగు మశ్చేందర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.
తమ గ్రామాలను ఘట్కేసర్ మున్సిపాలిటీలో కలపాలని లేదంటే మండలాన్ని కొనసాగించాలని కోరినట్లు తెలిపారు. అదేవిధంగా కక్షపూరిత రాజకీయాలకు తావు లేకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు మంత్రి సానుకూలంగా స్పందించి కలెక్టర్ కు ఉత్తర్వులు జారీ చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మచ్చ సందీప్ నేత, కాసుల వెంకటేష్ గౌడ్, మహేష్, గుమ్మడి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






