యువతిని వేధించిన జిమ్ కోచ్..!

by Ratna Kumari |   (  Updated:2026-05-13 16:58:34  IST  )

ఓ జిమ్ కోచ్ యువ‌తిని వేధించిన సంఘ‌ట‌న మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

యువతిని వేధించిన జిమ్ కోచ్..!
X

దిశ‌, మేడిప‌ల్లి : ఓ జిమ్ కోచ్ యువ‌తిని వేధించిన సంఘ‌ట‌న మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బోడుప్ప‌ల్ కి చెందిన ఓ యువ‌తి(28) స్థానికంగా ఉన్న కల్ట్ నియో జిమ్‌కు వెళ్తుండేది. ఈ క్రమంలో జిమ్ కోచ్ సంపంగి పవన్ కుమార్ జిమ్ డేటాబేస్ ద్వారా ఆమె ఫోన్ నెంబ‌ర్ సేకరించి పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. యువతి అతని ప్రవర్తనను తిరస్కరించగా.. పలుమార్లు ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేస్తూ మానసికంగా వేధింపులకు పాల్పడినట్టు స‌మాచారం.

అంతేకాకుండా యువతి తల్లి మొబైల్ నెంబ‌ర్ ని కూడా సంపాదించి సంప్రదించినట్లు ఆరోపించింది. దీంతో బాధితురాలు ఈ ఏడాది జనవరి 24 నుంచి జిమ్‌కు వెళ్లడం మానేసినా, నిందితుడు వెంబడిస్తూ బెదిరింపులు కొనసాగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మాట వినకపోతే ఇంటికి వస్తా అంటూ బెదిరించిన పవన్ కుమార్ బుధవారం ఉదయం యువతి ఇంటి వద్దకు వెళ్లి మరోసారి వేధించినట్లు వెల్లడైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story