- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల్లో శోధించే తత్వంతోనే విజ్ఞానానికి పునాది
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలని, ప్రతి అంశాన్ని శోధించడంతోనే విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకుంటారని జనవిజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కె. బురాన్ అన్నారు.

దిశ , కాప్రా : విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలని, ప్రతి అంశాన్ని శోధించడంతోనే విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకుంటారని జనవిజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కె. బురాన్ అన్నారు. జన విజ్ఞాన వేదిక, కృప విజ్ఞాన్ సైంటిఫిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈసీ నగర్ లో నిర్వహించిన వేసవి సైన్స్ శిక్షణ శిబిరం ముగింపు సమావేశం గురువారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ప్రసంగించారు. విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు, ఆలోచనలపై శిక్షణ, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవడంపై ప్రత్యేక అవగాహన కల్పించడం ఈ సైన్స్ వేసవి శిక్షణ శిబిరం ముఖ్య ఉద్దేశం అన్నారు. విద్యార్థులు నేర్చుకున్న విజ్ఞానాన్ని కేవలం తమకే పరిమితం చేయకుండా, తమ స్నేహితులకు, బంధువులకు మరియు తల్లిదండ్రులకు వివరించాలన్నారు. సమాజంలో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించినప్పుడే ఇటువంటి శిక్షణా శిబిరాల లక్ష్యం నెరవేరుతుంది.
పాఠశాల కరస్పాండెంట్ శరత్ సుదర్శి మాట్లాడుతూ.. జన విజ్ఞాన వేదికతో కలిసి తమ పాఠశాలలో మొట్టమొదటిసారిగా ఇటువంటి వైజ్ఞానిక శిబిరాన్ని నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. విద్యార్థుల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే.. సంతోషంగా ఉందని, వచ్చే వేసవి కాలంలో ఈసీ నగర్ ప్రాంతంలో రెండు లేదా మూడు శిబిరాలను ఏర్పాటు చేసి, మరింత ఎక్కువ మంది విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి కలిగించేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రశంసా పత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, జేవీవీ ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






