- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతి అదృశ్యం
ఈవెంట్ ఉంది మేకప్ వెయ్యడానికి వెళ్లొస్తానంటూ ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమయిన ఘటన ఘటన జగద్గిరిగుట్టలో ఆదివాకం చోటుచేసుకుంది.

X
దిశ, కుత్బుల్లాపూర్: ఈవెంట్ ఉంది మేకప్ వెయ్యడానికి వెళ్లొస్తానంటూ ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమయిన ఘటన ఘటన జగద్గిరిగుట్టలో ఆదివాకం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం శ్రీనివాస నగర్ లో నివాసం ఉంటున్న అంజకుమారి అనే యువతి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈవెంట్ ఉంది మేకప్ చేసి వస్తానంటూ మహా శివరాత్రి రోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఇంట్లో వారు యువతి మొబైల్ కు ఫోన్ చేయగా స్విఛ్ ఆఫ్ వచ్చింది. అదేవిధంగా బంధువుల, స్నేహితుల ఇంట్లో ఆరా తీయగా ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అంజకుమారి సోదరి ఫిర్యాదు మేరకు సీఐ సైదులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- missing
Next Story






