ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌లో కోల్పోతున్న భూముల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్

by Ratna Kumari |

రాజీవ్ రహదారి విస్తరణ కోసం భూములను ఇచ్చేందుకు ముందుకు వచ్చిన భూ నిర్వాసితులను మేడ్చల్ కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అభినందించారు.

ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌లో కోల్పోతున్న భూముల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్
X

దిశ‌, మేడ్చ‌ల్ బ్యూరో : రాజీవ్ రహదారి విస్తరణ కోసం భూములను ఇచ్చేందుకు ముందుకు వచ్చిన భూ నిర్వాసితులను మేడ్చల్ కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అభినందించారు. మంగళవారం కలెక్టరేట్ లో నిర్వహించిన డీఎల్ఎన్ సీ మీటింగ్ లో రాజీవ్ రహదారి కోసం స్వచ్ఛందంగా భూమిని ఇచ్చేందుకు ముందుకు వచ్చిన తూముకుంట రైతులు, స్థల యజమానులతో కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాలతి, శామీర్ పేట త‌హ‌శీల్దార్ సుచరితలు 'ధర నిర్ణయించిన విషయం విధితమే. రాజీవ్ రాహదారికి భూమి ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రైతులు, స్థల యాజమానులతో చర్చించిన కలెక్టర్ మను చౌదరి బుధవారం శామీర్ పేటలోని ఎలివేటెడ్ కారిడార్ లో పోయే స్థలాలను పరిశీలించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాలతి, ఎమ్మార్వో సుచరితలను రహదారి విస్తరణలో కోల్పోతున్న భూ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Next Story