మోడీకి మద్దతు ప్రకటించిన మాదిగ జాతికి కృతజ్ఞతలు: ఈటల రాజేందర్

by Disha Web Desk 12 |
మోడీకి మద్దతు ప్రకటించిన మాదిగ జాతికి కృతజ్ఞతలు: ఈటల రాజేందర్
X

దిశ, పేట్ బషీరాబాద్: ఎస్సీ వర్గీకరణ చేస్తాను అని చెప్పిన మోడీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన మాదిగ జాతికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు మల్కాజ్గిరి పార్లమెంటు బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఆయన సూరారం లో నిర్వహించిన రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ బిందెలు ఉన్నట్లుగా రేవంత్ రెడ్డి చెప్తున్నాడని, హామీలు నెరవేర్చడంలో ఆయన ఇప్పటికే చేతులెత్తేసాడని ఎద్దేవ చేశారు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండేది మోడీ అయితే మాట ఇచ్చి తప్పేవారు కేసిఆర్ రేవంత్ లు అని విమర్శించారు.

కెసీఆర్‌కు ఓటు వేస్తే వృధానే

దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాలుగు కోట్ల ఇళ్లను పేదలకు కట్టిస్తే నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అది చేస్తా ఇది చేస్తాం అంటూ ప్రగల్భాలు పలికారు తప్ప పేదవారికి ఇల్లు కట్టి ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో రెండు లక్షల ఇండ్లను మోడీ మంజూరు చేస్తే అవి కూడా కట్టి ఇవ్వడం కేసీఆర్ కు చేతకాలేదని విమర్శించారు. రెండు ధపాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నిరుద్యోగులకు భృతి ఇవ్వడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు.

రాహుల్ ఈ జన్మకి ప్రధాని అవుతారా..?

40 సీట్లు గెలిచేవారు ఏ విధంగా దేశానికి ప్రధాని అవుతారు అని ఈటల రాజేందర్ రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రశ్నించారు. ఆయన ఈ జన్మకు ప్రధాని అవుతారా అని అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో దేశవ్యాప్తంగా అనేకమార్లు బాంబు మూతలు వినిపించాయని ఎంతో మంది అమాయకులు చనిపోయారని కానీ నరేంద్ర మోడీ పాలనలో ఆ సమస్య లేదని తెలిపారు. 12 కోట్ల టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడడం తో పాటుగా ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుంది బిజెపి ప్రభుత్వం అని అన్నారు.

కరోనా మహమ్మారిని అధిగమించటానికి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందజేయడంతో పాటుగా ప్రపంచ దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించిన ఘనత నరేంద్రమోడీదని పేర్కొన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ధరణి గెలిపిస్తే మౌలిక సదుపాయంతో పాటుగా నిరుద్యోగం పై దృష్టి సారించి ఉద్యోగాలు కల్పించే విధంగా పనిచేస్తానని పార్లమెంటు ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మల్లారెడ్డి, గిరి వర్ధన్ రెడ్డి, భరత్ రెడ్డి, శ్రీరాములు, మల్లేష్, గణేష్, రాము తదితరులు పాల్గొన్నారు.


Next Story