- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూల్ లో ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నవిద్యార్థి అనుమానస్పద స్థితిలో పాఠశాల మూడో అంతస్తు నుంచి దూకి

దిశ, ఘట్కేసర్ : ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానస్పద స్థితిలో పాఠశాల మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే... కీసర యాదగిరిపల్లి కి చెందిన అభిచేతన్ రెడ్డి... పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాక్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్ రెండవ సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు.
గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 3వ అంతస్థుపై నుంచి మైనర్ విద్యార్థి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే గమనించిన స్కూల్ యాజమాన్యం విద్యార్థిని నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా , చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. అయితే, విద్యార్థి గత ఆరు నెలలుగా పాఠశాలకు సరిగా హాజరు కావడం లేదని... ఆత్మహత్యలకు గల కారణాలు తెలియదని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. కానీ పాఠశాల యాజమాన్యం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






