- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాచుపల్లిలో ఇద్దరు విద్యార్థుల సూసైడ్
బాచుపల్లిలో పెను విషాదం చోటు చేసుకుంది. బాచుపల్లి పీఎస్ పరిధిలో వేర్వేరు కళాశాలలో ఇద్దరు స్టూడెంట్స్ సోమవారం

*బాచుపల్లిలో ఇద్దరు విద్యార్థుల సూసైడ్*
*శ్రీ చైతన్య కళాశాలలో ఒకరు, ప్రగతి జూనియర్ కళాశాలలో మరొకరు*
దిశ, కుత్బుల్లాపూర్: బాచుపల్లిలో పెను విషాదం చోటు చేసుకుంది. బాచుపల్లి పీఎస్ పరిధిలో వేర్వేరు కళాశాలలో ఇద్దరు స్టూడెంట్స్ సోమవారం సాయంత్రం సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, మక్తల్ మహబూబ్ నగర్ కు చెందిన మధుసూదన్ రెడ్డి కూతురు ఎస్ వర్ష(16) బాచుపల్లి లోని శ్రీచైతన్య రెసిడెన్సియల్ జూనియర్ కళాశాల వైష్ణవి క్యాంపస్ లో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సాయంత్రం ఐదు గంటల సమయంలో బ్రేక్ కోసం గది లోకి వెళ్లి, చున్నీతో ఉరేసుకుని చనిపోయింది. బ్రేక్ కోసం వెళ్లిన అమ్మాయి చాలాసేపు అయినా తిరిగి రాకపోవడంతో తోటి స్నేహితులు, కళాశాల స్టాఫ్ గదికి వెళ్లి చూడగా డోర్ లాక్ వేసి ఉంది.
ఎంత పిలిచినప్పటికీ డోర్ ఓపెన్ చేయలేదు. దీంతో డోర్ పగులగొట్టి చూడగా ఫ్యాన్ కు వర్ష ఉరేసుకుని కనిపించింది. వైద్యం కోసం హాస్పిటల్ కు కళాశాల సిబ్బంది తరలించగా, పరిశీలించిన డాక్టర్స్ అప్పటికే చనిపోయిందని నిర్దారించారు. అటు నిజాంపేట్ 191 ఎన్ టీ ఆర్ నగర్ కాలనీకి చెందిన వెంకటేష్ కుమారుడు మంజునాథ్ (18) ప్రగతి నగర్ లోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ చదువుతున్నాడు. అయితే అదే కళాశాల లో చదువుకునే మరో అమ్మాయితో మంజునాథ్ ప్రేమలో ఉన్నట్లు సమాచారం.
లవ్ విషయంలో అమ్మాయి తల్లి, మరో స్త్రీ అబ్బాయి ఇంటికి వఛ్చి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో మంజునాథ్, ఫ్యాన్ కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. పై రెండు కేసులలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థుల సూసైడ్ కు పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. బాచుపల్లి పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






