- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటి వద్దనే సురక్షిత ప్రసవం..!
పురిటి నొప్పులతో తీవ్రంగా బాధపడుతున్న గర్భిణీకి 108 అంబులెన్స్ సిబ్బంది ఇంటి వద్దే సురక్షితంగా ప్రసవం నిర్వహించి తల్లి-బిడ్డలను కాపాడారు.

దిశ, మేడ్చల్ : పురిటి నొప్పులతో తీవ్రంగా బాధపడుతున్న గర్భిణీకి 108 అంబులెన్స్ సిబ్బంది ఇంటి వద్దే సురక్షితంగా ప్రసవం నిర్వహించి తల్లి-బిడ్డలను కాపాడారు. ఈ ఘటన మేడ్చల్ మండలం ఎల్లంపేట్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎల్లంపేట గ్రామానికి చెందిన పాణి నరేష్ కుమార్ భార్య సుగ్యని నాయక్ (31)కు గురువారం అర్ధరాత్రి సమయంలో ఆకస్మికంగా పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఈఎంటీ సీతారామ్, పైలట్ తిరుపతి హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే నొప్పులు తీవ్రంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించే సమయం లేదని గుర్తించిన సీతారామ్, ERCP వైద్యుడు డాక్టర్ శివ సూచనల మేరకు ఇంటి వద్దే ప్రసవం నిర్వహించారు. రాత్రి 1.55 గంటలకు సుగ్యని నాయక్ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. తదుపరి సంరక్షణ కోసం తల్లీ-బిడ్డలను మేడ్చల్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది సీతారామ్, తిరుపతికి సుగ్యని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.






