- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవాలి - ఆర్టీసీ నూతన ఎండీ
మారుతున్న కాలానికి అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవాలని టీఎస్ఆర్టీసీ నూతన ఎండీ నాగిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా

దిశ, మేడిపల్లి: మారుతున్న కాలానికి అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవాలని టీఎస్ఆర్టీసీ నూతన ఎండీ నాగిరెడ్డి అన్నారు. శనివారం ఉప్పల్ జోనల్ వర్క్ షాప్ లో ఆయన అధికారులతో పర్యటించారు. వర్క్ షాప్ లో జరిగే పక్రియను అన్ని సెక్షన్లను తిరిగి అందరి పనులు గమనించారు. ఉద్యోగుల పనులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వర్కుషాప్ ఆవరణలో మామిడి మొక్కను నాటారు. టీ ఆర్ఎస్ జోనల్ స్టోర్ పనితీరు పరిశీలించారు. ఆ తరువాత నిజాం కాలంనాటి బస్సులో వర్క్ షాప్ యందు ట్రయిల్ రన్ వేశారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఉత్పదాకతను , నాణ్యతను పెంచాలని, ఎప్పటికి అప్పుడు కాలానికి అనుగుణంగా స్కిల్స్ మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజనీర్ వెంకన్న, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హైదరాబాద్ ఖాన్, ఈడి కరీంనగర్ జోన్ సలోమాన్ రాజు ఉప్పల్ వర్కుషాప్ మేనేజర్ జగన్, మునిశేఖర్, రిజినల్ మేనేజర్ వరంగల్ విజయ భాను, సి టి ఎం ( కామర్షియల్ ) శ్రీధర్,చీఫ్ ఇంజనీర్ కవిత, మాధావారావు, రామకృష్ణ, సంతోష్,మహంకాళి మూర్తి, తదితరులు పాల్గొన్నారు.






