ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

by velandi.Saikiran |   (  Updated:2025-11-07 09:55:27  IST  )

వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్ చాకచక్యంతో

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను  ప్రమాదం
X

దిశ, ఘట్కేసర్: వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. చాకచక్యంతో బస్సును డివైడర్ పై నుంచి రోడ్డు పక్కకు డ్రైవర్ నిలిపివేయడంతో 28 ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం హనుమకొండ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సు (TG 27 Z 0011) మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ అవుషాపూర్ వద్దకు రాగానే వెనుక నుంచి అతివేగంగా వస్తున్న రెండు కార్లను డ్రైవర్ గమనించాడు.

జరగబోయే ప్రమాదాన్ని ముందస్తుగానే పసిగట్టిన డ్రైవర్ చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కకు నిలిపివేశాడు. అయితే రోడ్డు పక్కన నిలిపి వేసే క్రమంలో డివైడర్ పైకి ఎక్కి దిగుతుండగా బస్సు అద్దాలు పగిలిపోయాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపు బస్సు ముందు నుంచి రేసింగ్ తరహాలో రెండు కార్లు వెళ్లిపోయిన తర్వాత ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తమ ప్రాణాలకు కాపాడినందుకు ప్రయాణికులు ఆర్టీసీ డ్రైవర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story