- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమ వైన్ షాపు నిర్మాణానికి రెడ్ కార్పెట్!
అపార్ట్‌మెంట్ కు ఆనుకొని ఉన్న వైన్ షాపు అక్రమ నిర్మాణంపై రెండు నెలలుగా ఫిర్యా దులు చేస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించకపోవడం స్థాని కుల్లో ఆగ్రహానికి దారి తీసింది.

అక్రమ వైన్ షాపు నిర్మాణానికి రెడ్ కార్పెట్!
-రెండు నెలల ఫిర్యాదులకు స్పందన కరువు
-నోటీసులు, స్పీకింగ్ ఆర్డర్స్‌తో కాలయాపన
-అనుమతులేని నిర్మాణంపై చర్యల్లో వెనకడుగు
-కోర్టు తీర్పులు, జీహెచ్‌ఎంసీ సర్క్యులర్ల అమలు లోపం
-జోనల్ కమిషనర్‌ను నిలదీసిన ఎల్‌జీ సుచిత్ర క్లాసిక్ అపార్ట్‌మెంట్ వాసులు
-వెన్నెలగడ్డలో అక్రమ నిర్మాణంపై స్థానికుల పోరాటం
దిశ, పేట్ బషీరాబాద్: అపార్ట్‌మెంట్ కు ఆనుకొని ఉన్న వైన్ షాపు అక్రమ నిర్మాణంపై రెండు నెలలుగా ఫిర్యా దులు చేస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించకపోవడం స్థాని కుల్లో ఆగ్రహానికి దారి తీసింది. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు సూచనలు, జీహెచ్‌ఎంసీ సర్క్యుల ర్లు ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు కనిపించడం లేదు. కుత్బుల్లాపూర్ సర్కి ల్ పరిధి వెన్నెలగడ్డలో అనుమతు లు లేకుండా నిర్మించిన రేకుల షెడ్డు దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసినా గడువు ముగిసినా కూల్చివేత జరగలేదు.
సుచిత్ర–దుర్గా ఎస్టేట్ ప్రధాన రహదారిలో ఖాళీ స్థలంలో నిర్మాణం ప్రారంభ దశలోనే స్థానికులు ఆం దోళన వ్యక్తం చేశారు. మార్చి మొద టి వారంలో ధర్నా నిర్వహించి, మార్చి 6న జీడిమెట్ల సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్ట డం వల్ల ఇబ్బందులు కలుగుతాయని పేర్కొన్నారు. ఎల్‌జీ సుచిత్ర క్లాసిక్ అపార్ట్‌మెంట్, మనం ఇడ్లీ సెంటర్, బాటా షోరూమ్ పక్కన ఉన్న ప్లాట్‌లో ‘శ్రీ అరుణాచల వైన్స్’ కోసం నిర్మించిన షెడ్డు జీహెచ్‌ఎం సీ నిబంధనలకు విరుద్ధమని స్థాని కులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం ప్రజావాణిలో సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్తున్నారు.
ఫిర్యాదుల నేపథ్యంలో 16 మార్చి, 2026న షోకాజ్ నోటీస్ జారీ చేసి పనులు నిలిపివేయాలని ఆదేశించా రు. విచారణకు హాజరుకావాలని సూచించినా నిర్మాణదారుడు స్పం దించలేదు. దీంతో 06 ఏప్రిల్, 2026న స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసి 15 రోజుల్లో షెడ్డు తొలగించాలని హెచ్చరించారు. ఏప్రిల్ 24తో గడు వు ముగిసినా అధికారులు చర్యలు చేపట్టలేదు. అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చాలని న్యాయస్థానం ఆదేశాలున్నా అమలు జరగకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో 27 ఏప్రిల్, 2026న స్థానికులు మరోసారి ప్రజావాణిలో ఫిర్యాదు చేసి, కూల్చివేత ఎందుకు చేపట్టలేదో లిఖితపూర్వక సమాధా నం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రకారం షోకాజ్ నోటీసు తర్వాత నిర్మాణా న్ని తక్షణమే సీజ్ చేయాలని స్పష్టం చేసింది. దీనిపై 1 మే, 2025న జీ హెచ్‌ఎంసీ ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసి, ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ వ్యవహారంలో అధికారు ల నిర్లక్ష్యం చర్చనీయాంశంగా మా రింది. అక్రమ నిర్మాణాన్ని తొలగిం చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






