- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెలకు 2వేల క్వింటాళ్లు స్వాహా!
రేషన్ బియ్యం కుంభకోణంలో ‘తిలా పాపం తల పిడికెడు’ అన్న చందంగా తయారైంది. ఇప్పటి వరకు రేషన్ డీలర్ల నుంచి వినియోగదారులకు

దిశ, మేడ్చల్ బ్యూరో : రేషన్ బియ్యం కుంభకోణంలో ‘తిలా పాపం తల పిడికెడు’ అన్న చందంగా తయారైంది. ఇప్పటి వరకు రేషన్ డీలర్ల నుంచి వినియోగదారులకు అందించే బియ్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు ఉండగా, తాజాగా ఎఫ్‌సీఐ, ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే అవకతవకలు జరుగుతున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చోటు చేసుకున్న బియ్యం అక్రమ దందాతో వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మండల లెవల్ స్టాక్ పాయింట్లు (ఎంఎల్ఎస్) కేంద్రంగా బియ్యం అక్రమ దందా వ్యవహారం సాగుతోంది. డీలర్లు ఇచ్చే ఇండెంట్ ఆధారంగా స్టాక్ పాయింట్ల నుంచి బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా.. కొన్ని చోట్ల అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని తెలిసింది. ఇలా ఒక మేడ్చల్ జిల్లాలోనే ప్రతి నెల దాదాపు 2వేల క్వింటాళ్ల బియ్యం నల్లబజారుకు తరలుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
క్వింటాకు రెండు కిలోలు..
జిల్లాలో బియ్యం కుంభకోణంలో తవ్వేకొద్ది కొన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల అడ్డగా భారీ అవకతవకలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పాయింట్ల వద్దనే డీలర్లకు ఇచ్చే బియ్యంలో క్వింటాకు రెండు కిలోల వరకు నొక్కేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 6 ఎంఎల్ఎస్ పాయింట్ల ఉండగా, ప్రతి నెల కనీసంగా ఒక్కో పాయింట్ వద్ద 200 క్వింటాళ్ల బియ్యం మిగుల్చుకుంటున్నట్లు సమాచారం. విషయం బయటకు పొక్కితే డీలర్ షిప్‌కు ఎసరు వస్తుందనే భయంతో డీలర్లు కూడా ఈ భారాన్ని మౌనంగానే భరిస్తున్నారని తెలుస్తోంది. 70 క్వింటాళ్లు ఇవ్వాల్సి ఉన్న డీలర్‌కు 67 క్వింటాళ్లతో సరిపెడుతున్నారు. అధికారులతో గొడవపడి లేని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకనే ఉద్దేశంతో డీలర్లు మిన్నకుంటున్నట్లు మల్కాజిగిరికి చెందిన ఓ లీడర్ ‘దిశ’తో తెలిపారు. కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసే సమయంలో ఈ నష్టాన్ని సర్దుబాటు చేసుకుంటున్నట్లు వాపోయాడు.
బియ్యం ఎందుకు తక్కువిస్తున్నారంటే..
బియ్యం తక్కువగా ఇవ్వడంపై కొందరు అధికారులు ఒక వాదన వినిపిస్తున్నారు. ప్రస్తుతం టెయిర్ వెయిట్ (సంచి తూకం) ఇవ్వడంలేదని చెబుతున్నారు. క్వింటాకు రెండు బస్తాలు వస్తాయని, వీటి బరువు ఒక కేజీ 100 గ్రాములు ఉంటుందంటున్నారు. ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యే బియ్యమే క్వింటా స్థానంలో 998.9 కేజీలు ఉంటోందని. ఇక లోడింగ్, అన్ లోడింగ్‌లో కనీసం ఒక కేజీ మేర తరగు ఉంటుందని.. అంటే క్వింటా మీద రెండు కేజీల వరకు తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ తరుగు కొన్ని టన్నుల మేర వస్తోందని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనిని భర్తీ చేసుకునేందుకు డీలర్లకు కొందరు తక్కువగా ఇస్తుండవచ్చని చెప్పుకొస్తున్నారు. మరికొందరు మాత్రం బియ్యంలో తరుగుకు అనుగుణంగా ప్రభుత్వం అదనంగా బియ్యం సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. క్వింటాకు అదనంగా రెండు కిలోల బియ్యం లెక్కగట్టి సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇకపోతే తరుగుని అంచనా వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని కూడా నియమించగా, ఆ బృందం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నిర్దేశించిన ఎంఎల్ఎస్ పాయింట్లలో తూకాలను, తరుగును పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
విచారణ వేగవంతం..
మేడ్చల్ జిల్లాలో జరిగిన బియ్యం కుంభకోణంపై విచారణను వేగవంతం చేశారు. అదనపు కలెక్టర్ రాధిక గుప్తా ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జిల్లాలోని 6 ఎంఎల్ఎస్ పాయింట్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 3 నెలలకు ఒక్కో ఎంఎల్ఎస్ పాయింట్‌కు ఎంత బియ్యం కోటా వచ్చింది. అందులో నుంచి డీలర్లకు ఎంత పంపిణీ చేశారు. డీలర్ల నుంచి లబ్దిదారులకు సక్రమంగా పంపిణీ జరిగిందా..? లేదా? అని అరా తీస్తున్నారు. అయితే ఈ కుంభకోణంలో అధికారుల పాత్రపై కూడా క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.






